టాలీవుడ్ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత నటన, అందానికి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత ఆగ్ర హీరోయిన్ గా తన సత్తాను చాటుతున్నారు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఆ సినిమా అనంతరం వరుస పెట్టి సినిమాలలో నటించి ఆగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా చేసింది. అయితే సమంత తెలుగులో నటించిన ఆఖరి చిత్రం ఖుషీ.


సినిమా అనంతరం సమంత ఇప్పటివరకు తెలుగులో సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తుంది. సమంత చేసిన హనీ బన్నీ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది. దీంతో సమంత బాలీవుడ్ పైనే తన పూర్తి ఫోకస్ పెడుతోంది. ఇదిలా ఉండగా.... సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా తన పర్సనల్ విషయాలను కూడా సమంత షేర్ చేసుకోవడం విశేషం.


కాగా, సమంత నిన్న ఇన్స్టా వేదికగా తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అందులో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు సమంత. అందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీలో నజ్రియా, సాయి పల్లవి, అలియా భట్ లాంటి హీరోయిన్లు రాక్ స్టార్లు అని సమంత వెల్లడించారు. నెగిటివ్ ఆలోచనలను అధిగమించడానికి ప్రతిరోజు మెడిటేషన్ చేస్తానని సమంత ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.


తెలుగులో మళ్లీ మీరు సినిమాలు చేయాలని ఓ అభిమాని అడగగా... తప్పకుండా మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తానని కచ్చితంగా వస్తాను అంటూ సమంత సమాధానమిచ్చారు. దీంతో సమంత సినిమాలు చేస్తుందని తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: