
జూనియర్ ఎన్టీఆర్ కి ప్రభాస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే . పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న హీరోలు ఒక్కొక్క సినిమాకి వెయ్యి కోట్లకు పైగానే రెమ్యూనరేసహన్ అందుకుంటున్నారు . కాగా ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలోను ఓ రేంజ్ లో దున్నేయడానికి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ఆల్రెడీ వార్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసాడు . అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లోని సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .
కాగా ఇదే మూమెంట్లో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ సైతం వరుస మూవీలతో బిజీబిజీగా ముందుకు వెళుతున్నాడు. ఈ ఇద్దరికీ కూడా బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . క్రేజ్ కూడా ఉంది . కాగా ఇప్పుడు బాలీవుడ్ బడా దర్శకుడు దాన్ని బాగా ప్లస్ గా మార్చుకోబోతున్నారట. పాన్ ఇండియా లెవెల్ లో జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా ప్రభాస్ లను పెట్టి బిగ్ బడా మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాడట బాలీవుడ్ స్టార్ దర్శకుడు .
అంతేకాదు కరణ్ జోహార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసే విధంగా మాట్లాడుకున్నారట . అంతేకాదు హీరోయిన్లుగా అలియాభట్ అదే విధంగా కీయరా అద్వానీలను చూస్ చేసుకున్నారట . అయితే వీరిద్దరి కాల్ షీట్స్ ఒక టైం లో సెట్ కాకపోతూ ఉండడంతో ఈ ప్రాజెక్టు పై కొత్త డౌట్లు మొదలయ్యాయి . ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ అడ్జస్ట్ చేసి కాల్ షీట్స్ ఇస్తే మాత్రం ఈ సినిమా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అంటున్నారు మేకర్స్. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ కాంబోలో మూవీ రావాలి అంటూ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరబోతుంది అంటూ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు..!