టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ డైరెక్టర్ శంకర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే ఇండియన్2, గేమ్ చేంజర్ సినిమాలతో శంకర్ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 3 సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాతో శంకర్ కి కచ్చితంగా భారీ సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
 
తాజాగా శంకర్ డ్రాగన్ సినిమా గురించి రివ్యూ ఇవ్వగా ఆ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. డ్రాగన్ సినిమా చూసి నాకు కన్నీళ్లు వచ్చాయని శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రాగన్ మూవీ ఒక మంచి కథా చిత్రం అని శంకర్ చెప్పుకొచ్చారు. డ్రాగన్ కథను రచించిన తీరు అద్భుతంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడు అశ్వత్ మారి ముత్తు కు హ్యాట్సాఫ్ అని శంకర్ కామెంట్లు చేశారు. ఈ సినిమాలోని పాత్రలన్నీ చూడచక్కగా ఉన్నాయని పాత్రధారులంతా పరిపూర్ణంగా నటించారని శంకర్ అన్నారు.
 
ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో తనలో ఉన్న నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారని రాఘవన్ పాత్రలో ఆయన నటన చాలా బాగుందని చెప్పుకొచ్చారు. ముష్కిన్, అనుపమ, జార్జ్ మరియన్ పోషించిన పాత్రలు మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయని సినిమాలోని చివరి 20 నిమిషాలు నన్ను ఎంతగానో కదిలించాయని శంకర్ అన్నారు.
 
మోసాలు నిండిపోతున్న సమాజానికి ఇలాంటి సందేశాలు అవసరం అని నిర్మాణ సంస్థతో పాటు ఇతర బృందానికి నా అభినందనలు అని శంకర్ వెల్లడించారు. శంకర్ డ్రాగన్ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడం గురించి ప్రదీప్ రంగనాథన్ రియాక్ట్ అయ్యారు. నేను శంకర్ సినిమాలు చూస్తూ పెరిగానని ఒక అభిమానిగా శంకర్ నుంచి ఎప్పటికీ స్ఫూర్తి పొందుతానని వెల్లడించారు. శంకర్ సార్ నుంచి ఇలాంటి రిప్లై వస్తుందని ఊహించలేదని చాలా సంతోషంగా ఉందని ప్రదీప్ రంగనాథన్ కామెంట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: