చిన్నతనం నుంచి నటన అంటే ఎంతో ఆసక్తి .. అందుకే చిన్న వయసులోనే సంస్కృతిక కార్యక్రమాలు ఎంతో చురుగ్గా పాల్గొనేవాడు .. అలాగే మిమిక్రీ సైతం నేర్చుకున్నాడు ప‌లు టీవీ షోలో పాల్గొని తన్నుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు .. కానీ అంతకంటే ముందు కలెక్టర్ స్మిత సబర్వాల్ దగ్గర ఉద్యోగం చేశాడు .. కొన్నాళ్లకు టాప్ కామెడీ షో జబర్దస్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వరుస‌ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నాడు .. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈ కుర్రాడు ఇప్పుడు స్టార్ కమెడియన్గా ఎదిగాడు ..


 తెలంగాణ యాసలో అతను చెప్పే డైలాగ్స్ .. యాక్టింగ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు .. రెండు నిమిషాలు ఆగుతావా అంటూ అతను ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్ అయిం ది.. ఇంతకీ ఆ కమెడియన్ మరెవరో కాదు రచ్చ రవి. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో బిజీగా మారుతున్నారు .. యాంకర్ ఉదయభాను హోస్టింగ్ చేసిన వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్ ద్వారా తొలిసారిగా మిమిక్రీ ప్రదర్శన ఇచ్చాడు .. ఇక‌ ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించాడు .. అలా చివరకు అవకాశాలు రాకపోవడంతో హైదరాబాద్ నుంచి తిరిగి వరంగల్ వెళ్లిపోయాడు అక్కడ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ చిన్న ఉద్యోగం చేశాడు .. అలా కొన్నాళ్ళు కలెక్టర్ స్మిత సబర్వాల్ వాళ్ళ దగ్గర జాబ్ చేశాడు ..


అయితే నటనపై ఉన్న ఆసక్తితో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగానికి రాజీనామా చేసి .. దుబాయ్ వెళ్లి అక్కడ రేడియో జాకీగా కూడా చేశాడు .. అయితే అక్కడ రచ్చ రవి చేసిన ప్రోగ్రామ్స్ భాగ సక్సెస్ కావడం తో మళ్లీ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అయితే అదే సమయంలో జబర్దస్త్ కామెడీ షోలో అవకాశం తెచ్చుకున్నాడు .. చమ్మక్ చంద్ర టీం లో తీసుకోలేదా రెండు లక్షల కట్నం అంటూ రచ్చ రవి చెప్పే డైలాగులు ఎంతో ఫేమస్ అయ్యాయి .. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస‌ అవకాశాలు అందుకుంటూ .. ఎఫ్2 , సరిలేరు నీకెవ్వరు, భీమా, ఓం భీమ్ భుష్, గద్దల కొండ గణేష్, బలగం, భగవంత్‌ కేసరి వంటి సినిమాలో నటించి అల్లరించారు .. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు రచ్చ రవి.

మరింత సమాచారం తెలుసుకోండి: