
ఆ హీరోయిన్ మరెవరో కాదు భాగ్య శ్రీ బోర్సే .. ఈమధ్య రవితేజ హీరో గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైంది .. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది . కానీ ఈ సినిమాతో భాగ్య శ్రీ బోర్సే మాత్రం ఎంతో ఫేమస్ అయ్యింది .. అందం , అభినయంతో మంచి మార్కులు అందుకుంది .. అలాగే అదిరిపోయే నటన ఎక్స్ప్రెషన్స్ డాన్స్ తో తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది ఈ హీరోయిన్ .
మోడలింగ్ రంగం నుంచి చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టింది భాగ్యశ్రీ బోర్సే .. మారియన్ 2 సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది .. ఆ తర్వాత హిందీలో ఆమె నటించడం సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి . ఇక తెలుగులో చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా సైతం ఫ్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీ బోర్సే కు భారీ క్రేజీ వచ్చింది .. ప్రస్తుతం విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్నారుగౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న కింగ్డమ్ సినిమాలో నటిస్తుంది .. అలాగే మరో ఆరు సినిమాల్లో కూడా నటిస్తుంది.