
ధనుష్ డైరెక్షన్లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా ? సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ , అనిఖా సురేంద్రన్ హీరోయిన్లుగా నటించారు .. ఇక అనిఖా సురేంద్రన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది ,, అజిత్ హీరోగా వచ్చిన వరుస సినిమాల్లో ఆయనకు కూతురుగా నటించి మెప్పించింది .. ఇక ఇప్పుడు ఈమె హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది .. ఇక తెలుగులో బుట్ట బొమ్మ సినిమాతో ఆకట్టుకుంది అనిఖా ..
అయితే ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో మంచి విజయం అందుకుంది .. తాజాగా అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ ధనుష్ పై ప్రశంసలు వర్షం కురిపించింది .. సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీ ఆసక్తికర పోస్ట్ ని కూడా షేర్ చేసింది .. జాబిలమ్మ నీకు అంత కోపమా ముగిసింది .. ధనుష్ సార్ కి ఎప్పటికీ నా కృతజ్ఞతలు .. మీరు నా కలను నెరవేర్చారు .. ధనుష్ గారికి నేను పెద్ద అభిమానిని నేనొక సినిమా ఛాన్స్ కావాలని అడిగాను దాంతో ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు .. ధనుష్ దర్శకత్వంలో నటించడం అనేది నేను నా కలలో కూడా ఎప్పుడు ఊహించలేదు .. ధనుష్ సార్‌కు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా భారీ పోస్టును రాసుకు వచ్చింది .. అనిఖా సురేంద్రన్ .. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.