
ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా ఫౌజీ సినిమా మాత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతి సినిమా 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఆదుకునే విషయంలో ప్రభాస్ ముందు వరసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ రచయిత తోట ప్రసాద్ ప్రభాస్ మంచి మనసు గురించి వెల్లడించారు.
2010 సంవత్సరంలో తాను ఆసుపత్రిలో చేరానని ఆ సమయంలో ప్రభాస్ తన తండ్రి మరణించినా నేను ఆస్పత్రిలో ఉన్నానని తెలిసి చికిత్సకు డబ్బు అందేలా తన వంతు సహాయ సహకారాలు అందించారని వెల్లడించారు. స్టార్ హీరో ప్రభాస్ గొప్ప మనసును ఆయన కొనియాడారు. ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టార్ హీరో ప్రభాస్ రియల్ హీరో అని ప్రభాస్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. తర్వాత సినిమాలతో ప్రభాస్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మనస్సు బంగారం అని ప్రభాస్ ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.