
తాజాగా హిట్ 3 సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తూ ఉన్నారు నాని కెరియర్ లో ఈ సినిమా 32 వ చిత్రంగా తెరకెక్కించారు. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడవ సినిమా కావడం చేత ఈ సినిమా పైన అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాతగా కూడా నానిన వ్యవహరిస్తూ ఉన్నారు. మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ను సైతం వేగవంతం చేస్తోంది.
చిత్ర బృందం గతంతో ఫస్ట్ లుక్ గ్లింప్స్ అంటూ ఒక వీడియోని విడుదల చేయగా.. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా హిట్ 3 టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది.. టీజర్ లో నాని మరొకసారి యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టడమే కాకుండా తన నటన తో నెక్స్ట్ లెవెల్ కి టీజర్ ని తీసుకువెళ్లారు. ఇందులో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తూ ఉన్నది. ఇందులోని వైలెన్స్ కూడా అందరిని భయభ్రాంతులకు చేసేలా కనిపిస్తూ ఉన్నాయి. మరి రక్తపాతం ఎక్కువగా కూడా కనిపిస్తోంది హిట్ 3 లో.. గతంలో హిట్ విశ్వక్ సెన్ తో తీయగా.. హిట్-2 చిత్రాన్ని అడవి శేషు నటించిన హిట్ 3 లో నాని నటిస్తూ ఉన్నారు.