టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో మంచు లక్ష్మి ఒకరు. సీనియర్ నటి శ్రీదేవి గురించి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. జిమ్ లో శ్రీదేవిని చూసిన తర్వాత నా మనస్సు మార్చుకున్నానని మంచు లక్ష్మి తెలిపారు. శ్రీదేవిని ఒకసారి జిమ్ లో చూశానని ఆ సమయంలో ఆమె ట్రెడ్ మిల్ పై పరుగెడుతోందని మంచు లక్ష్మి తెలిపారు.
 
అప్పుడు జిమ్ లోపలికి అడుగుపెట్టడానికి నేను ఒకటికి రెండుసార్లు ఆలోచించానని ఆమె అన్నారు. శ్రీదేవి తన జుట్టుకు ఒత్తుగా నూనె పట్టించి ఉందని ఆమె చెప్పుకొచ్చారు. సౌత్ ఇండియాలో జుట్టుకు నూనె పట్టించుకోవడం సాధారణ విషయం అని అయితే జుట్టుకు నూనె పట్టడాన్ని నేను అసలు ఇష్టపడేదాన్ని కాదని మంచు లక్ష్మి వెల్లడించారు.
 
ఎప్పుడైతే శ్రీదేవిని ఆ విధంగా చూశానో నా మనస్సు మారిపోయిందని అమె అన్నారు. శ్రీదేవి గొప్ప నటి అని అంత గొప్ప నటి అయినప్పటికీ ఆమె తన తలకు నూనె రాసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించిందని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. శ్రీదేవి ఎప్పుడూ సహజంగా ఉండటానికి ఇష్టపడతారని ఆమె అన్నారు. మహీరా కపూర్ మంచు లక్ష్మి కామెంట్స్ గురించి రియాక్ట్ అవుతూ శ్రీదేవికి ఏం చేయాలో ఏం తినాలో అన్నీ తెలుసని వెల్లడించారు.
 
54 సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యలతో శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. మంచు లక్ష్మి సైతం తనకు వచ్చిన మంచి ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఆమె భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో క్లారిటీ రావాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: