ఏంటి టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మగా పేరున్న బ్రహ్మానందం పై మిగతా కమెడియన్లు పగబట్టారా.. ఇంతకీ బ్రహ్మానందం పై పగబట్టేంత తప్పు ఆయన ఏం చేశారు.. ఎందుకు అంత పెద్ద రచ్చ చేయాలని చూశారు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యం అనేది ఎప్పటినుండో కొనసాగుతున్న మాట.అయితే కమెడియన్ లలో కామెడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం కూడా ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది కమెడియన్లపై ఆదిపత్యం చేయాలని చూసేవారట. కానీ ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుంది కాబట్టి అలా చేయడాన్ని వాళ్ళు అస్సలు సహించలేకపోయారట. దాంతో చాలామంది కమెడియన్లు బ్రహ్మానందంతో చాలా సినిమా షూటింగ్స్ లో గొడవపడ్డారట. అయితే ప్రతిసారి బ్రహ్మానందం అల వారితో గొడవ పెట్టుకోవడం సహించలేని ఓ 20 మంది కమెడియన్లు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారట. 

అయితే ఈ మీటింగ్ లో ప్రధానంగా ఏవీఎస్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏవీఎస్,బ్రహ్మానందం కి కూడా గొడవలు ఉన్నాయి అనే టాక్ అప్పట్లో వినిపించింది.అలాగే బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు వంటి వాళ్లు బాబు మోహన్ సినిమాలో ఉంటే నటించం అని చెప్పినట్టు కూడా ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి.అయితే బ్రహ్మానందం చేసే పని నచ్చక ఓ 20 మంది కమెడియన్లు ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మానందం గురించి మాట్లాడాలని,రచ్చ రచ్చ చేద్దామని చూసారట.కానీ ఈ విషయంలో చిరంజీవి కమెడియన్లకు నచ్చజెప్పి ఇంకోసారి అలాంటివి రిపీట్ కాకూడదని సర్దిచెప్పారట. దాంతో ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్నారట. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పోలప్రగడ జనార్దన్ రావు చెప్పారు.

ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఓసారి కమెడియన్లు మీటింగ్ పెట్టుకున్న సమయంలో నన్ను పిలవలేదు. ఇక  ఆ మీటింగ్ కి మీరెందుకు వెళ్ళలేదని నన్ను బ్రహ్మానందం అడిగితే వాళ్ళు పిలిస్తే వెళ్లేవాడిని కావచ్చు.కానీ నన్ను వాళ్ళు పిలవలేదు.అయితే ఆ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళందరూ మీతో గొడవ పడిన వాళ్లే.కానీ మీతో నాకు గొడవ జరగలేదు. కాబట్టి నన్ను పిలవలేదు కావచ్చు అని నేను బ్రహ్మానందంతో చెప్పాను. ఆయన కూడా అవును మీకు నాకు గొడవలు లేవు కాబట్టి మిమ్మల్ని ఆ మీటింగ్ కి పిలవలేదు అని ఆయన కూడా రియలైజ్ అయ్యారు.అయితే ఆరోజు పెద్ద రచ్చ చేద్దాం ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నారు. కానీ చిరంజీవి ఎంట్రీ ఇవ్వడంతో ఆ గొడవలు సర్దుమనిగాయి అంటూ పోలప్రగడ జనార్దన్ రావు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: