సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ బోలెడు మంది ఉంటారు . కానీ క్రేజీ రికార్డ్స్ అందుకున్న హీరోయిన్లు మాత్రం కొంతమంది . సాధారణంగా హీరోయిన్స్ అంటే కేవలం సినిమాలో గ్లామర్ టచ్ కి మాత్రమే పనికి వస్తారు అని అంతా అనుకుంటారు . కానీ అదంతా తప్పు అని గ్లామరే కాదు నటనపరంగా కూడా ది బెస్ట్ ఇవ్వగలము అంటూ ప్రూవ్ చేశారు కొంతమంది హీరోయిన్స్ . ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటుంది హీరోయిన్ అనుష్క శెట్టి . అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందాల ముద్దుగుమ్మ. అందానికి అందం నటనకి నటన మంచితనానికి మంచితనం అన్నీ కూడా కలగాల్సిన ఓ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ సాధించలేని ఒక రేర్ రికార్డ్ అనుష్కకు మాత్రమే సొంతమైంది.


దానికి సంబంధించిన న్యూస్ ని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అనుష్క శెట్టి ఫ్యాన్స్ . సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎక్స్పోజింగ్ రోల్ చేస్తే కచ్చితంగా ఆ హీరోయిన్ కి అలాంటి రోల్స్ ఇస్తూ ఉంటారు . ఇప్పటివరకు చరిత్ర చెబుతున్న పాఠం అదే . ఎవరైతే హీరోయిన్ ముందుగా ట్రెడిషినల్ గా నటించిన ఆ తర్వాత హాట్ ఎక్స్పోజింగ్ రోల్స్ చేస్తారో.. కచ్చితంగా ఆమె తర్వాత లిస్టులో ఉండే మూవీలంతా కూడా హాట్ ఎక్స్పోజింగ్ రోల్స్ ఉంటాయి.



కానీ అనుష్క మాత్రం అలా కానేకాదు . బిల్లా సినిమాలో ఎంత హాట్ గా నటించిందో .. ఆ తర్వాత కొన్ని సినిమాలలో ఆమె ట్రెడిషనల్ పాత్రలోనూ మెప్పించింది . మరీ ముఖ్యంగా "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి "సినిమాలో ఎంత ట్రెడిషనల్ పద్ధతిలో నటించి ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే . అదేవిధంగా త్వరలో రిలీజ్ కాబోతున్న "ఘాటీ" సినిమాలలో ఆమె లుక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అందరికీ తెలుసు. అయితే ఇప్పటివరకు ఇలాంటి రేర్ రికార్డు ఏ హీరోయిన్ కూడా అందుకోలేదు . ఎంత బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ పాత్రలో నటించిన ఆ తర్వాత ట్రెడిషనల్ లుక్స్ క్యారెక్టర్ అందుకున్న ఏకైక హీరోయిన్ అనుష్క శెట్టి గా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును తన పేరుపై లిఖించుకుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: