
అయితే సినిమా ఇండస్ట్రీలోనే ఫస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ గా బిగ్ రికార్డ్ క్రియేట్ చేసిన హీరోయిన్ పేరును ఇప్పుడు జనాలు ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు . కొంతమంది హీరోయిన్స్ అంటే జనాలు బాగా లైక్ చేస్తూ ఉంటారు . ఆ లిస్టు లోకి వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటీ. ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించినా ఈ బ్యూటీ..ఒక్కే ఒక్క సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ ఒకే ఒక్క సినిమా బాహుబలి . ఇక్కడ మీరు చూస్తున్న ఈ హీరోయిన్ మరెవర్ఫ్ కాదు అనుష్క శెట్టి .
ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేసిన అనుష్క శెట్టి ప్రజెంట్ "ఘాటీ" సినిమా కోసం వెయిట్ చేస్తుంది . ఎప్పటికప్పుడు తన పర్సనల్ .. అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్ కారణంగా వార్తల్లో నిలిచే అనుష్క శెట్టి "ఘాటీ" సినిమాతో మరొక బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ సినిమాకి డైరెక్టర్ గా క్రిష్ ఉండడం ఈ సినిమాపై హైప్ పెంచేలా చేసింది. బాహుబలి సినిమాలో అనుష్క పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాలో అనుష్కను కాకుండా మరి ఎవరిని కూడా ఆ రోల్ లో ఊహించుకోలేము అంటూ జనాలు ఓపెన్గానే బయటపెట్టారు. మరి ముఖ్యంగా ప్రభాస్ - అనుష్కల మధ్య వచ్చే సీన్స్ సినిమా ని ఓ రేంజ్ లో హిట్ అయ్యేలా చేశాయి అని కూడా జనాలు మాట్లాడుకున్నారు. ప్రజెంట్ అనుష్క పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!