
ఇక రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా.... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టని విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కాగా, ఈ సినిమా వల్ల దిల్ రాజు భారీగా నష్టపోయారని ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. పెద్దగా లాభాలు రాలేదు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ఆర్టిస్టులను మోసం చేసిందని పోలీస్ స్టేషన్లో ఆర్టిస్టులు అందరూ ఫిర్యాదు చేశారు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు 350 మంది కలిసి వెళ్ళామని ఆర్టిస్టులు చెప్పారు.
కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు ఒక్కొక్కరికి రూ. 1200 ఇస్తానని ఒప్పుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వడం లేదని గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఆర్టిస్ట్ తరుణ్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గేమ్ చేంజర్ సినిమా నిర్మాత ది ల్ రాజు తమకు న్యాయం చేయాలంటూ ఆర్టిస్టులు వేడుకుంటున్నారు. వారిని మోసం చేసిన కో డైరెక్టర్ స్వర్గం శివపై తప్పకుండా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాత దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.