
ఇక నాని ఆ తర్వాత అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎదిగి భారీ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా స్టార్ హీరోల రేంజ్ ను అందుకుంటాడు అంటూ విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకున్నాడు .. ప్రస్తుతం ఇండస్ట్రిలో 200 కోట్ల మార్కెట్ కలిగి ఉన్న హీరోగా తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ తెచ్చుకున్నాడు .. మరి ఇలాంటి క్రమంలోని ఆయన చేస్తున్న వరుస సినిమాలు కూడా భారీ విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాయి .. ఇక అష్టా చమ్మా , అలా మొదలైంది , ఈగ , పిల్ల జమిందార్ , బలే బలే మగాడివోయ్ , ఎవడే సుబ్రహ్మణ్యం , దసరా , హాయ్ నాన్న , సరిపోద్దా శనివారం లాంటి సినిమాలు తో నాని తనకంటూ ప్రత్యేక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు .
అలాంటి నాని ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు .. ప్రస్తుతం నాని శైలాష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఒదలా దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉండబోతున్నాడు. ఏది ఏమైనా కూడా నాని చిత్ర పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా 400 రూపాయలకు తన కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజ్ రవితేజ తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోల్లో నాని కూడా ఒక్కడిగా పేరు తెచ్చుకున్నాడు .. ఇలాంటి నాని రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.