నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ .. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను యంగ్ దర్శకుడు బాబి తెర్కకించగా పూర్తి యాక్షన్ సినిమా గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది .. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచుకున్న డాకు మహారాజ్ ఓటీటీ లోను అదే రేంజ్ లో హిట్ అయింది .. ఈనెల 21నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో భారీ రెస్పాన్స్ వస్తుంది . ముఖ్యంగా డాకు మహారాజ్ చూసి ఇతర భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు ..


ఈ క్రమంలో నే  మలయాళ ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు .. రీసెంట్ గా ఇలాంటి విజువల్ మాస్క్ ఫిస్ట్ చూడలేదు అంటూ బాలయ్య మాస్ ప్రెజెన్స్ వేరే లెవల్ అంటూ పోస్టులు పెడుతున్నారు . ఇలా మొత్తానికి డాకు మహారాజ్‌ సినిమా పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , యూఏఈ వంటి దేశాల్లో టాప్ 2 లో ట్రెండ్ అవుతుండటం మరో విశేషం .. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ప్రగ్యా జైస్వాల్ మరియు శ్రద్ధ శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు .. అలాగే మరో హీరోయిన్లు చాందిని చౌదరి , ఊర్వశి రౌటేలా కూడా నటించారు .. ఈ సినిమాల్లో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ నటించి అదరగొట్టారు .


సినిమాలో వీటీ గణేష్ , బేబీ వేద అగర్వాల్,  వంటివారు మిగిలిన పాత్రలో నటించారు . ఫార్చున్ ఫోర్ సినిమాస్‌తో పాటు సితార‌ ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు .. అలాగే ఈ సినిమాకు తమన్‌ అందించిన సంగీతం మరో లెవెల్ లో ఉంది .. ఈ సినిమాతో బాలయ్య వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రస్తుతం బోయపాటి తో ఆఖండ 2 సినిమా చేస్తున్నాడు బాలయ్య.  ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: