టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా ... ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథను అందించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రీతూ వర్మ ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా నటించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 26 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను , పాటలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాపై గట్టి నమ్మకం ఉన్న మేకర్స్ ఆ మూవీ విడుదలకు ముందు రోజే ఆ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ప్రదర్శిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక మజాకా మూవీ యూనిట్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు అనగా ఫిబ్రవరి 25 వ తేదీన ప్రదర్శించే ఆలోచనలో ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షో లకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమాకు ఓపెనింగ్ డే రోజు అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ గనుక వస్తే ఓపెనింగ్స్ ఈ మూవీ కి పెద్దగా వచ్చే అవకాశం ఉండదు అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk