సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగాలి అంటే విజయాలు ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తాయి అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఇప్పటికే ఎంతో మంది నటనలో కాస్త వీక్ గా ఉన్న మంచి విజయాలను అందుకున్నట్లయితే స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకున్న వారు అనేక మంది ఉండడమే. ఇకపోతే కొంత మంది విషయంలో మాత్రం ఇది రాంగ్ అని ప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది నటి మణులు నటించిన సినిమాలు పెద్ద స్థాయి విజయాలను అందుకోకపోయినా వారు తమ నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారు కూడా ఉన్నారు.

ఇప్పటి వరకు తెలుగు లో ఒకే ఒక సినిమాలో నటించిన ఓ ముద్దు గుమ్మకు ఆ సినిమా ద్వారా భారీ డిజాస్టర్ వచ్చినా కూడా వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఆ సినిమాలు కనుక మంచి విజయాలు సాధించినట్లయితే ఆ నటి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగే అవకాశాలు అనేక శాతం ఉన్నాయి అనే అభిప్రాయాలను కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఒకే ఒక సినిమాలో నటించి దానితో కూడా ఫ్లాప్ ను అందుకున్న వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్న బ్యూటీ ఎవరో కాదు భాగ్య శ్రీ బోర్స్. ఈ నటి రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. దానితో ఈమెకు వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఆ సినిమాలు కనుక మంచి విజయాలు సాధించినట్లయితే ఈ బ్యూటీ తెలుగు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అభిప్రాయాలను అనేక మంది ప్రేక్షకులు వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: