టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు అనేక సినిమాలను నిర్మించాడు. అందులో చాలా సినిమాలో మంచి విజయాలు సాధించడంతో నిర్మాతగా దిల్ రాజు కి అద్భుతమైన క్రేజ్ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం దిల్ రాజు ఓ మై ఫ్రెండ్ అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... సిద్ధార్థ్ హీరో గా హన్సిక హీరోయిన్ గా శృతి హాసన్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మేము ఓ మై ఫ్రెండ్ అనే సినిమాను మా బ్యానర్ లో నిర్మించాము. సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఆఫ్ షూటింగ్ కంప్లీట్ అయింది. దానితో నేను ఆ సినిమా ఫస్ట్ అఫ్ చూసాను. నాకు ఎక్కడో తేడా కొట్టి నట్టు అనిపించింది. దానితో సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలను కూడా జాయిన్ చేశాం. ఇక సెకండాఫ్ పూర్తి అయిన తర్వాత మొత్తం సినిమా నేను చూశాను. అప్పటికి కూడా సినిమా నాకు తేడాగానే అనిపించింది. దానితో నేను ఈ సినిమా ఆడదు అని కొంత మంది కి చెప్పాను. వారు మాత్రం సినిమా అద్భుతంగా ఉంది. కచ్చితంగా హిట్ అవుతుంది అన్నారు.

ఇక సినిమా విడుదల అయ్యింది. నేను చెప్పినట్టే ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి గొప్ప టాక్ రాలేదు. దానితో నేను సినిమా బాగుండదు అని చెప్పిన నన్ను ఖండించిన వారంతా ఆ తర్వాత నీ డిసిషన్ కరెక్ట్ , నువ్వు చెప్పినట్లే జరిగింది అని అన్నారు. కాకపోతే ఆ సినిమా మొత్తంగా అందరికీ నచ్చకుండా లేదు. కానీ ఎక్కువ శాతం జనాలకు ఆ సినిమా నచ్చలేదు. అందుకే ఆ సినిమా రిసల్ట్ తేడా కొట్టింది అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: