
అలాగే ఈ మేరకు ఆయనపై ఫ్యామిలీ కోర్టులో విచారణకు కూడా హాజరయ్యారు .. అయితే ఇదే క్రమంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎలాంటి రాజీకి సిద్ధంగా లేనని న్యాయమూర్తితో చెప్పారు .. అలాగే తన మాజీ భార్య రంజనా తన నుంచి డబ్బులు వస్సులు చేయడానికి ప్రయత్నిస్తుందంటూ ఆమెపై ఆరోపణలు కూడా చేశారు. అయితే గతంలో ఉదిత్ రంజనాకు నెలకు 15000 రూపాయలు ఇచ్చేవారట ,, 2021లో దాన్ని 25 వేల రూపాయలగా పెంచారు విలువైన భూమి ఇంటిని కూడా రాసిచ్చారట .. అలాగే 25 లక్షలు విలువైన నగలను కూడా ఇచ్చారట .. అయితే తన మాజీ భార్య రంజిన వాటిని అమ్మేసిందని ఆరోపణలు చేస్తున్నాడు. ఇదే సమయంలో రంజనా కూడా మాట్లాడుతూ ..
ఉదిత్ నన్ను అసలు పట్టించుకోవడంలేదని భూమి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు 18 లక్షలు ఆయన దగ్గరే ఉంచుకున్నాడని .. నేను ముంబాయికి వచ్చిన ప్రతిసారి నన్ను బెదిరిస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది .. ఉదిత్ , రంజనా 1984 లో పెళ్లి చేసుకున్నారు .. అయితే ఆ తర్వాత వారి జీవితంలో మనస్పర్థలు వచ్చాయి .. దీంతో విడాకులు తీసుకుని విడిపోయారు .. ఇదే క్రమంలో ఉదిత్ తన మొదటి వివాహం గురించి చాలా రోజులు ఎవరికి చెప్పలేదట .. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించి విడాకులను సెటిల్ చేసుకుందట .. అప్పుడే ఉదిత్ ఆమెకు భరణం కింద ఇల్లు కొంత స్థలంతో పాటు కొంత బంగారం కూడా ఇచ్చారట.