తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన కథ రచయితలో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. ఇకపోతే ఈయన చిరంజీవి హీరోగా రూపొందిన అనేక సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర సినిమాకు కూడా ఈయన పని చేశాడు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ "ఇంద్ర" సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఇంద్ర సినిమా గురించి మాట్లాడుతూ ... చిరంజీవి హీరోగా బి . గోపాల్ దర్శకత్వంలో అశ్విని దత్ ఓ మూవీ చేయాలి అనుకున్నాడు.

అందులో భాగంగా గోపాల్ ను ఒక రోజు కలిసి చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది , అది వినండి. అది మీకు నచ్చితే చిరంజీవి గారితో సినిమా చేద్దాం అని చెప్పాడు. దానితో గోపాల్ ఆ కథను విన్నాడు. కానీ ఆ కథతో ఆయనకు చిరంజీవితో సినిమా చేయడం ఇష్టం లేదు. ఆ విషయం నాకు తెలిసింది. ఇక ఒక రోజు నాకు ఆయన ఎదురు పడ్డాడు. కానీ నాతో మాట్లాడకూడదు అని గోపాల్ సైడు నుండి వెళ్లిపోయాడు. ఇక నేను గోపాల్ ను కలిసి ఎందుకు నువ్వు చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో చిరంజీవితో సినిమా చేయను అంటున్నావు అని ప్రశ్నించాను. దానితో గోపాల్ నేను ఇప్పటికే బాలకృష్ణతో సమరసింహారెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను. చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథ కూడా దాదాపు అలాంటి పోలికలతోనే ఉంది. ఇప్పటికే నేను చిరంజీవి గారితో మెకానిక్ అల్లుడు సినిమా చేసే ఆయనకు అపజయాన్ని ఇచ్చాను.

మళ్లీ ఆయనకు అలాంటి రిజల్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మంచి కథ దొరికినప్పుడు ఆయనతో సినిమా చేస్తాను అని అన్నాడు. దానితో నేను నువ్వు బాలకృష్ణతో ప్యాక్షన్ సినిమాలు చేశావు. చిరంజీవితో కాదు. చిరంజీవితో ఫ్యాక్షన్ సినిమా చేయి ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్నాను. దానితో ఆయన కన్విన్స్ అయ్యి చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఇంద్ర అనే టైటిల్ తో మూవీ చేశాడుఎం ఆ మూవీ ఏకంగా ఇంట్రెస్ట్ హిట్ అయింది అని పరుచూరి గోపాలకృష్ణ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: