
అందుకే ఫ్యాన్స్ ఆయన సినిమాలను లైక్ చేస్తూ ఉంటారు . కాగా ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాడు సుకుమార్ అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సుకుమార్ పుష్ప2 సినిమా తర్వాత చాలా సైలెంట్ అయిపోయాడు. ఎక్కడ పెద్దగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు అడపదడపా తన కూతురు సుకృతి నటించిన గాంధీతాత సినిమా ప్రమోషన్స్ లో కనిపించారు తప్పిస్తే ఆ తర్వాత బయటకు పెద్దగా కనిపించట్లేదు. కాగా ఇప్పుడు మాత్రం సుకుమార్ - రామచరణ్ తో తెరకెక్కించే సినిమాను వేరే లెవెల్లో చిత్రీకరించబోతున్నారట .
ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన 70% క్యాస్ట్ అండ్ క్రూ ని ఫిక్స్ చేసేసారట . ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్ కూడా అన్ని రెడీగా చూస్ చేసి పెట్టుకున్నారట. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేసి రామ్ చరణ్ లేకుండానే కొన్ని సీన్స్ షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట . అన్ని కలిసి వస్తే రామ్ చరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27వ తేదీ ఈ సినిమా పూజా కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే సుకుమార్ ఇంత సైలెంట్ గా పనులు కానిచేయడానికి కారణం ఈ సోషల్ మీడియా లీక్స్ అని పుష్ప2 విషయంలో కూడా సోషల్ మీడియా లీక్స్ చాలా చాలా ఇబ్బందికర సిచువేషన్ ని క్రియేట్ చేసింది అని మాట్లాడుకుంటున్నారు..!