ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ  ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ప్రధాన కారకుడు సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. కేవలం సినిమాలే కాకుండా రాజకీయ పార్టీని కూడా స్థాపించి ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.. అయితే ఈ పార్టీని స్థాపించింది నందమూరి ఫ్యామిలీ వీరుడు ఎన్టీఆర్, అయినా కానీ ఆ ఫ్యామిలీ నుంచి పార్టీకి సంబంధించి ఎవరు కూడా రాజకీయంగా పెద్దగా ఎదగలేదు.. ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి నందమూరి హరికృష్ణ ఎంతో కష్టపడ్డారు.. కానీ ఎన్టీఆర్ కు వయసు మీద పడిన తర్వాత పార్టీ పగ్గాలను చంద్రబాబు తన చేతిలోకి తీసుకున్నారు. 

ఆ తర్వాత పార్టీ తన చేతిలోకి వచ్చిన తర్వాత హరికృష్ణను పార్టీకి దూరం చేశారని ఇప్పటికీ కొన్ని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. బాలకృష్ణ మాత్రమే ఆ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నారు. ఈయన తప్ప మిగతావారు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా లేరు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం jr ఎన్టీఆర్ కూడా టీడీపీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన ప్రచారం చేసిన ఏడాది టిడిపి ఓటమిపాలైంది. ఈ విధంగా టిడిపిలో  ప్రధాన భాగస్వామ్యులైనటువంటి హరికృష్ణ, ఎన్టీఆర్ లను బాబు వాడుకొని కరివేపాకుల తీసివేశారని మోహన్ బాబు  ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

 అంతేకాదు చంద్రబాబు నాకు చాలా దగ్గర మిత్రుడని, కానీ ఆయన నన్ను కూడా మోసం చేశారని మోహన్ బాబు తెలియజేశారు.. ఈ విధంగా మోహన్ బాబు చంద్రబాబుపై తన మనసులోని మాటను బయట పెట్టడంతో, టిడిపి నాయకులంతా ఫైర్ అవుతున్నారు.. ఆయన వల్లే టీడీపీ ఈ పొజిషన్ లోకి వచ్చిందని, ఆయన లేకుంటే ఇప్పటికీ పార్టీ కనిపించకుండా పోయేదని కామెంట్లు పెడుతున్నారు.. సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన ఏకైకవీరుడు చంద్రబాబు అంటూ ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: