
మార్చ్ మొదటి వారంలో విశ్వంభర నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కాబోతుంది .. అక్కడి నుంచి వరుసగా పాటల్ని బయటకు వదులుతారు .. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా మెల్లగా మొదలు కాబోతున్నాయి .. ఇప్పటికే హిందీ రైట్స్ 38 కోట్లకు అమ్మేరని తెలుస్తుంది .. అందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా బయటకు రావాల్సి ఉంది .. అలాగే ఓటిటి బేరాలు కూడా గట్టిగా జరుగుతున్నాయి .. అలాగే ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ మెగా క్వీన్ నిహారిక కూడా గెస్ట్ రోల్స్ లో కనిపిస్తున్నారని .. అలాగే ఒక పాటలో ఇద్దరూ చిరంజీవితో కలిసి మెరవ బోతున్నారని తెలుస్తుంది .
అయితే సినిమా యూనిట్ మాత్రం దీని గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు .. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందట .. అందులో నటించే వాళ్ళు ఎవరనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి చిరు విశ్వంభర సినిమా మేలో వస్తుందా లేక ఇంకా ముందుకు వెళ్తుందా అనే దానిపై కూడా చిత్ర యూనిట్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వటం లేదు. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ చివర్లో రిలీజ్ చేస్తారని అంటున్నారు.