ఈ మధ్యకాలంలో ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే హీరో ఎంత ప్రధాన కారణంగా మారిపోయాడో.. హీరోయిన్ కూడా అంతే ప్రధాన కారణంగా మారిపోతుంది . రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టడానికి మెయిన్ కారణం హీరోయిన్సే అన్న సంగతి అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా యానిమల్ - పుష్ప2- ఛావా లాంటి సినిమాలు హిట్ అవ్వడానికి 50% కారణం హీరోయిన్ లే అంటూ పొగిడేస్తారు జనాలు.  కాగా ఈ క్రమంలోనే డైరెక్టర్స్ హీరోల విషయంలో ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో హీరోయిన్ విషయంలోనూ అంతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆ బ్యూటీ మరవరో కాదు ఐశ్వర్య రాజేష్ . "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ ఆచితూచి ఆఫర్స్ ను చూస్ చేసుకుంటుంది . సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బోలెడు ఆఫర్స్ వచ్చాయి . కానీ అన్ని ఆఫర్స్ ను ఆమె ఓకే చేయడం లేదు . ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది .

కాగా ఈ క్రమంలోనే రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబోలో తెరకెక్కే సినిమాలో ట్రెడిషనల్ క్యారెక్టర్ అయిన సెకండ్ హీరోయిన్ పాత్రకు బుచ్చిబాబు సనా ఐశ్వర్య రాజేష్ ని అప్రోచ్ అయ్యారట. ఆమె ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆల్ రెడి ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వీ కపూర్ సెలెక్ట్ అయింది.  అయితే జాన్వి కపూర్ హాట్ హీరోయిన్ గానే కనిపించబోతుందట ఈ సినిమాలో. ఇక  ట్రెడిషనల్ లుక్స్ లో ఫ్యాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ లో ఐశ్వర్య రాజేష్ - రామ్ చరణ్ కి భార్య గా నటించబోతుందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఐశ్వర్య రాజేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకొని ఈ రోల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక ఐశ్వర్య రాజేష్ కెరియర్ కి డొకా ఉండదు . తద్వారా జాన్వీ కపూర్  కెరియర్ ఆల్మోస్ట్ ఆల్ ఖతమ్ అనే చెప్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: