ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం థియేటర్ లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవో.. ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏవో తెలుసుకుందాం.
 
ఈ వారం థియేటర్ లలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ధమాకా మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యాన‌ర్‌ అలాగే జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రాజేష్ దండా నిర్మాతగా పనిచేస్తున్నాడు. శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రీతువర్మ నటిస్తుంది. అలాగే అగాధియా సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. శబ్దం మూవీ ఫిబ్రవరి 28న, తకిట తదిమి తందాన మూవీ ఫిబ్రవరి 27న, రాక్షస సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానున్నాయి.

 
ఇదిలా ఉండగా.. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల లిస్ట్ చూద్దాం. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మార్చి 1న రిలీజ్ కానుంది. అమెజాన్ ఫ్రైమ్ లో ఫిబ్రవరి 27న జిద్ధి గర్ల్స్, హౌస్ ఆఫ్ డేవిడ్.. 28న సుజల్ 2, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్, లవ్ హార్స్, ప్రెజెన్స్ విడుదల కానున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సూట్స్ ఎల్ ఎ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ నెల 28న లవ్ అండర్ కన్స్ట్రక్షన్, ది వాస్ప్ సినిమా స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో రన్నింగ్ పాయింట్, డెమోన్ సిటీ, కౌంటర్ ఎటాక్, 11 రెబల్స్ సినిమాలు రానున్నాయి. లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో 1992 అనే సినిమా స్ట్రీమింగ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: