టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలు అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే నాని కొంత కాలం క్రితం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో దసరా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు.

మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాతో నాని కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కగా. .. శ్రీకాంత్ ఓదెలకు కూడా ఈ సినిమాతో సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల "ది పారడైజ్" అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో రూపొందిన దసరా సినిమా మంచి విజయం సాధించి ఉండడంతో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ది పారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా నుండి మార్చి 3 వ తేదీన ఒక అదిరిపోయే రేంజ్ వీడియోను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే నాని ప్రస్తుతం ది పారడైజ్ మూవీ తో పాటు హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: