టాలీవుడ్ ఇండస్ట్రీబిలో ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును కూడా దక్కించుకున్నాడు. ఆ తర్వాత పలకనామా దాస్ అనే సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించి తన నటనతో పాటు దర్శకుడిగా కూడా ఈయన తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

ఆ తర్వాత ఈయన ఎన్నో సినిమాలకు హీరో గా నటించి మంచి విజయాలను అందుకొని నటుడిగా మంచి క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకోవడం మాత్రమే కాకుండా దాస్ కా దమ్కి అనే మరో సినిమాకు కూడా దర్శకత్వం వహించి ఆ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా తనను తాను మరో సారి విశ్వక్ సేన్ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం విశ్వక్ కి వరుస పెట్టి ఫ్లాప్ వస్తున్నాయి. తాజాగా ఈయన లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కూడా కనిపించాడు. కానీ ఈ సినిమా మాత్రం ఆయనకు బాక్సా ఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈయన ఫంకీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో విశ్వక్  కి జోడిగా యంగ్ బ్యూటీ కాయడు లోహర్ ను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా విడుదల అయిన రిటన్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా ఈమెకు విశ్వక్ సేన్ హీరో గా రూపొందుతున్న ఫంకీ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs