టాలీవుడ్ నిర్మాత మహేష్ రెడ్డి ఇంటా పెళ్లి సందడి మొదలైంది. మహేష్ రెడ్డి కుమారుడు నితీష్ రెడ్డి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. నితీష్ పెళ్లి దుబాయ్ లో జరుగుతుంది. ఈ సందర్భంగా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఆ పెళ్లిలో సందడి చేయడానికి వెళ్లారు. ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీలు అందరూ వారి ఫ్యామిలీలతో అక్కడే ఉన్నారు. వారందరూ కలిసి ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ని కూడా వీక్షించారు.
అయితే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతాతో.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనతో.. జూనియర్ ఎన్టీఆర్ ఆయన సతీమణి ప్రణతితో అక్కడ హంగామా చేస్తున్నారు. అలాగే మిగితా ప్రముఖులు కూడా పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు. వీరితో పాటుగా డైరెక్టర్ సుకుమార్ కూడా తన కుటుంబంతో పెళ్లిలో మెరిశారు. ఇక మహేష్ బాబు భార్య నమ్రతా పెళ్లిలో లేడీస్ పార్టీలో పాల్గొంటూ.. వరుసగా సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తుంది.   
ఇక మెగా, నందమూరి, ఘట్టమనేని ఫ్యామిలీతో పాటుగా అక్కినేని ఫ్యామిలీ కూడా నితీష్, కీర్తి పెళ్లికి హాజరయ్యారు. అక్కినేని నాగ చైతన్య, భార్య శోభితతో కలిసి వచ్చారు. అక్కినేని అఖిల అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఫేమస్ నాటు నాటు సాంగ్ కి సెప్పులు వేశారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా తెగ పోస్టులు పెడుతున్నారు. అలా షేర్ చేసిన ఫోటోస్ లో.. ఒక ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించారు. కానీ ఆ ఫ్రేమ్ లో వారిద్దరూ ఎవరి బీజీలో వాళ్లు ఉన్నట్లు కనిపించింది. ఇంకేముంది ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫ్యాన్ ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటో చూసిన ఆర్ఆర్ఆర్ అభిమానులు టాలీవుడ్ టాప్ హీరోస్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: