టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే అనేక సందర్భాలలో ఈ ముగ్గురు హీరోలలో ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఓ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ముగ్గురు హీరోలు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డాయి. ఈ ముగ్గురు హీరోలు నటించిన ఏ సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర తలపడ్డాయి. ఆ సినిమాలు ఏవి ..? అందులో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. ఈ మూడు మూవీ లు కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి. ఇందులో చిరంజీవి హీరో గా రూపొందిన మృగరాజు సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకోగా , బాలకృష్ణ హీరో గా రూపొందిన నరసింహ నాయుడు సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. వెంకటేష్ హీరో గా రూపొందిన దేవిపుత్రుడు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. దానితో చివరగా చిరంజీవి హీరో గా రూపొందిన మృగరాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా , బాలకృష్ణ హీరో గా రూపొందిన నరసింహ నాయుడు సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. వెంకటేష్ హీరో గా రూపొందిన దేవిపుత్రుడు సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరు , బాలయ్య , వెంకీ సినిమాలు పోటీ పడగా , అందులో బాలయ్య హీరోగా రూపొందిన నరసింహ నాయుడు మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: