సినిమా ఇండస్ట్రీ లో అనేక మంది నటులు అనేక సినిమాలను వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే కొంత మంది హీరోలు తమ దగ్గరకు వచ్చిన కథ నచ్చని పరిస్థితుల్లో సినిమాను వదిలేస్తూ ఉంటారు. మరి కొంత మంది సినిమా కథ నచ్చిన కూడా ఆ సమయంలో వేరే సినిమాలకు కమిటీ కావడం వల్ల ఆ సినిమా చేయలేని పరిస్థితుల్లో మూవీ ని వదిలేస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది సినిమా కథ నచ్చిన కూడా తమ ఈమేజ్ వల్ల ఆ సినిమా కథకు నష్టం జరుగుతుంది. ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా సినిమాలను వదిలేసిన హీరోలు ఉన్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి తన ఈమేజ్ వల్ల సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఓ మూవీ ని వదిలేసాడట. ఇక ఆ సినిమాను వేరే హీరోతో రూపొందించగా ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుందట. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ , అర్జున్ హీరో గా మన్యంలో మొనగాడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే మొదట కోడి రామకృష్ణ ఈ సినిమాలో అర్జున్ ను హీరోగా అనుకోలేదట. చిరంజీవి ని ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవి ని కలిసి ఆయనకు కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న చిరంజీవి స్టోరీ సూపర్ గా ఉంది. కానీ నా ఈమేజ్ వల్ల ఈ సినిమా కథకు ప్రాబ్లం అవుతుంది. సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నా బదులు వేరే వారితో ఈ సినిమా చేయండి హిట్ అవుతుంది అని చెప్పాడట. ఆ సలహా మేరకు అర్జున్ తో కోడి రామకృష్ణ మన్యంలో మొనగాడు టైటిల్ తో ఆ కథను సినిమాగా రూపొందించగా అది అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: