టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన చందమామ , మగధీర సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకోవడం , ఈ సినిమాల్లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ సినిమాల ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

వరస విజయాలతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇది ఇలా ఉంటే ఈమె ఇప్పటి వరకు చాలా మంది యంగ్ హీరోలతో , సీనియర్ హీరోలతో నటించి అదిరిపోయే రేంజ్ జోష్లో కెరీర్ను చాలా సంవత్సరాల పాటు కొనసాగించింది. ఇకపోతే ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ , నాగార్జునతో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున "రగడ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క , ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీ లో ప్రియమణి పాత్రకు మొదట కాజల్ అగర్వాల్ ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆఖరుగా కాజల్ ను స్థానంలో ప్రియమణి ని ఈ మూవీ బృందం వారు తీసుకున్నారట. ఇకపోతే నాగార్జున కొంతకాలం క్రితం ది ఘోస్ట్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ లో మొదట నాగార్జున కు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల చివరగా ఈ మూవీ లో కాజల్ ను కాకుండా ఈ మూవీ బృందం వారు సోనాల్ చౌహాన్ ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. ఇలా రెండు సార్లు నాగార్జున , కాజల్ కాంబోలో సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: