
అలా దర్శకుడిగా ఎదగలనుకున్న నాని.. హీరోగా ప్రేక్షకులను మెప్పించి, వారి ప్రేమను సొంతం చేసుకున్నాడు. నాని అష్టా చమ్మా సినిమా తర్వాత చాలానే సినిమాలు చేశాడు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా చేశాడు. ఈ సినిమా ద్వారా విమర్శకుల నుండి కూడా మెప్పులు పొందారు. ఆ తర్వాత మజ్ను, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఎవడే సుబ్రమణ్యం, నేను లోకల్, పిల్ల జమీందార్, అలా మొదలైంది, దసరా, జెర్సీ, హాయ్ నాన్న, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేసి.. మంచి హిట్ లను అందుకున్నారు. హీరో నాని నటన న్యాచురల్ గా ఉండడంతో.. అందరూ నానికి న్యాచురల్ స్టార్ అని ట్యాగ్ కూడా ఇచ్చేశారు. అలాగే మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2కి యాంకర్ గా కూడా చేశాడు.
ఇదిలా ఉండగా.. స్టార్ హీరో నాని సినిమా అంటేనే మొదట అందరికీ గుర్తు వచ్చేది.. ఆయన స్టోరీ సెలెక్షన్, అలాగే ఎమోషన్ తో కూడిన సినిమాలనే నాని ఎంచుకుంటారు. అయితే నేడు నాని పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే తన మొదటి పారితోషికం రూ. 4000 అంట. అప్పుడు అంతా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నాని.. ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ. 25 కోట్లకు పైనే తీసుకుంటున్నాడు అంట. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హిట్ 3, ప్యారడైస్ సినిమాలతో బీజీగా ఉన్నారు.