తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఇకపోతే బన్నీ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కొన్ని రోజుల క్రితం పుష్ప పార్ట్ 2 మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 2 సినిమా చిత్రీకరణ దశలో సినిమా ఉన్న సమయంలో , అలాగే విడుదలకు ముందు వరకు బన్నీ "పుష్ప 2" మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం మాత్రం అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో మూవీ సెట్ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.  ఇకపోతే అట్లీ ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు.

అందులో ఒక్క సినిమా కూడా అపజయం అందుకోలేదు. ఈయన కమర్షియల్ సినిమాలను రూపొందించడంలో సూపర్ స్పెషలిస్ట్. దానితో అల్లు అర్జున్ "పుష్ప" లాంటి అద్భుతమైన విజయం తర్వాత మరో కమర్షియల్ సక్సెస్ అందుకోవాలి అనే ఉద్దేశంతో అట్లీ తో సినిమా చేయాలి అని అనుకుంటున్నట్లున్నాడు , అందుకే తన తదుపరి మూవీ కి అట్లీ ని దర్శకుడిగా ఎంపిక చేసుకొని ఉంటాడు అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: