నటుడు ఉన్ని ముకుందన్ ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈయన మలయాళంలో సినిమాలతో పాటుగా తెలుగు, తమిళం సినిమాలలో కూడా నటిస్తాడు. ఉన్ని ముకుందన్ తెలుగు సినిమాలు అయిన జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి సినిమాలలో నటించాడు. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకున్నాడు. ఉన్ని ముకుందన్ తన నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
 
ప్రస్తుతం ముకుందన్ మార్కో సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమాలో ముకుందన్ యాక్షన్ హీరోగా కనిపించాడు. ఈ సినిమాతో ఆయన మంచి పేరు రావడంతో పాటుగా.. నిర్మాతలకు కూడా కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముకుందన్ ఓ మల్టీఫ్లేక్స్ కు వెళ్లాడు. అక్కడ ఓ అభిమాని ముకుందన్ ని చూసేందుకు దగ్గరికి వెళ్లాడు. ఆయనతో ఫోటో తీసుకునేందుకు ఫోన్ పట్టుకుని.. ఆయనను వీడియో తీస్తూ వెంబడించాడు. దీంతో ఉన్ని ముకుందన్ సహనం కోల్పోయి.. అభిమాని దగ్గర ఉన్న ఫోన్ కి లాక్కున్నాడు. ఆ ఫోన్ ని జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు. అభిమాని వెళ్లి బతిమిలాడక ఆ ఫోన్ ని తిరిగి ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 
ఇక ఈ వీడియోని చూసిన అభిమానులు అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే 'మీరు హీరోగా ఎదిగే సమయంలో ఎవరైనా అభిమాని అంటూ మీ దగ్గరికి వస్తే ఆనందపడతారు. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదుగుతారు. అప్పుడు మాత్రం అభిమాని అంటూ వస్తే చిరాకు పడుతుంటారు' అని రాసుకొచ్చాడు. మరొక్కరు ఏమో 'హీరోను మరి అంతా దగ్గరగా వెళ్లి వీడియో తీయాలా.. అలా చేస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది. ఇంకా నయం తిరిగి ఫోన్ ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: