సీనియర్ నటి టబు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒకప్పటి కాలంలో టబు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి ఇమేజ్ దక్కించుకుంది. తెలుగు, హిందీలో ఎన్నో సినిమాలలో నటించి అభిమానులను అలరించింది. కాగా, ప్రస్తుతం టబు సినిమాలలో పెద్దగా నటించడం లేదు. చాలా రోజుల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు కేవలం అమ్మ, అత్త వంటి పాత్రలలో మాత్రమే నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 53 సంవత్సరాలు.

కాగా, టబు ఇప్పటివరకు వివాహం చేసుకోకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టబు సినిమాల్లో తన హవాను కొనసాగిస్తున్న సమయంలో హీరోలతో ప్రేమలో ఉన్నట్లు, ఎఫైర్లు కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే వారిలో టబు ఎవరిని కూడా వివాహం చేసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం టబు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోంది. అది మాత్రమే కాకుండా బోల్డ్ అటెంప్ట్ లు విడిచి పెట్టకుండా సినిమాలలో నటిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో టబు పేరు తెరపైకి వస్తోంది.

తాజాగా టబుతో ఓ హీరో అసభ్యంగా ప్రవర్తించాడట. అంతేకాకుండా టబుని ఇష్టం వచ్చినట్టుగా టచ్ చేసాడట. దీంతో కోపం వచ్చిన టబు ఆ హీరోపై చేయి చేసుకున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు బయటకు రావడం లేదు. ఆ హీరో పేరు తెరపైకి వస్తే ఏమైనా లేనిపోని సమస్యలు వస్తాయేమోనని టబు కాస్త భయపడుతుందట. ఈ విషయం పైన టబు ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: