టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సీనియర్ నటి త్రిష గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ బ్యూటీ తనదైన నటన, అందంతో ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు అందుకుంది. ఒకప్పటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 20 ఏళ్లకు పైనే అయినప్పటికీ ఇప్పటికీ సినిమాలలో నటిస్తుండడం విశేషం. ఈ బ్యూటీ తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును అందుకుంటుంది.

 కాగా, ప్రస్తుతం త్రిష వయసు 41 సంవత్సరాలు. అయినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే హ్యాపీ లైఫ్ కొనసాగిస్తోంది. కాగా, ఈ చిన్నది సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది. త్రిష వయసు పెరిగినప్పటికీ సినిమాలు తీయడంలో ఏ మాత్రం రాజీ పడడం లేదు.

ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఈ క్రమంలోనే ఈ చిన్న దానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. త్రిష ఒక్కో సినిమాలో నటించడానికి భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట. దాదాపు ఒక్కో సినిమాలో నటించడానికి పది కోట్లకు పైనే డిమాండ్ చేస్తుందట. తాను డిమాండ్ చేసిన దానికన్నా తక్కువ డబ్బులు ఇస్తే సినిమాలలో నటించడానికి అసలు ఒప్పుకోవడం లేదట. తాను అడిగినంత డబ్బులు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. ఇక మరికొంతమంది నిర్మాతలు కాస్త వెనకడుగు వేస్తున్నారట. ఇదే వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: