
ఇటీవలే తన భర్తతో కలిసి పార్టీలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అక్కడ హైలెట్గా నిలిచింది.ముఖ్యంగా ఆమె వేసుకున్న డ్రస్సు అందరిని ఆకట్టుకుంది. అయితే కొన్ని నివేదికలు తెలిపిన ప్రకారం ఈ డ్రెస్సు ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..2.50 లక్షల రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో అభిమానులు కూడా కీర్తి సురేష్ క్యూట్ గా ఉందని ఈ జోడి సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ధర చూసి మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని 15 ఏళ్లుగా ప్రేమించు మరి వివాహం చేసుకున్నది. వివాహమనంతరం అక్కడక్కడ తన భర్తతో కలిసి పార్టీలు ఈవెంట్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక కీర్తి సురేష్ ధరించినటువంటి ఈ గౌను రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా తయారు చేశారట. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఆనందానికి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటూ ఉన్నది. వివాహమానంతరం బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమా విడుదల అవ్వగా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కీర్తి సురేష్ భర్త ఆంటోనీ కూడా ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరట.