టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు సెట్ అవుతాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వుంటారు. ఆ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ వుంటారు.. కానీ హీరోకి, దర్శకుడికి వున్న కమిట్ మెంట్స్ కారణంగా ఆ కాంబినేషన్ లో సినిమా సెట్ అవడం లేట్ అవుతూ వస్తుంది.. అలాంటి కాంబినేషన్స్ లో త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్ ఒకటి..ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేస్తే చూడాలని ఎంతో కాలంగా ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అలాగే నిర్మాత స్రవంతి రవికిషోర్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారు. బహిరంగ వేదికల మీదే ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు..

అయితే తాజాగా ఈ కాంబినేషన్ కి గ్రీన్ సిగ్నల్ పడినట్లు తెలుస్తుంది... '’పుష్ప 2” సినిమా తర్వాత అల్లు అర్జున్‌,త్రివిక్రమ్‌ కలసి పని చేయాల్సి ఉంది. ఆ సినిమా ప్రిపరేషన్లు  కూడా పెద్ద ఎత్తున జరిగాయి..అయితే ఆ సినిమా ఇప్పట్లో ప్రారంభమవ్వదని తెలుస్తుంది.. అందుకే త్రివిక్రమ్‌ వేరే సినిమా చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం.. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలంతా వారి కమిట్మెంట్స్ తో బిజీగా వున్నారు.. దీనితో త్రివిక్రమ్, రామ్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.అయితే గతంలో త్రివిక్రమ్ కి ఇలాంటి సమస్యే వచ్చింది..

ఆ సమయంలో నితిన్ హీరోగా త్రివిక్రమ్ “అఆ “ సినిమా చేసాడు.. ఆ సినిమా మంచి విజయం సాధించింది..ఇప్పుడు రామ్ తో కూడా త్రివిక్రమ్ ఓ క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..ఈ సినిమాతో ఎప్పటి నుంచో త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్ లో సినిమా చూడాలనే ఫ్యాన్స్ కి ఆ కోరిక తీరినట్లే.. అలాగే అల్లుఅర్జున్ ఈ గ్యాప్ లో అట్లీ మూవీ కంప్లీట్ చేసుకుంటాడు.. ఆ తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: