తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో పాత్రలలో నటించి మెప్పించిన నిర్మలమ్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలో కూడా నటించింది. ఇమే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ ప్రాంతంలోనే జన్మించింది. చిన్న వయసు నుంచే నాటకాలు అంటే ఇష్టం ఉండడంతో తన మనసులో కూడా అదే విషయాన్ని బలంగా నాటుకు పోయేలా చేసిందట. అందుకే నిర్మలమ్మ మొదట హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఎక్కువగా అవకాశాలు రాలేదట. దీంతో ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి ఎన్నో చిత్రాలలో నటించింది.


అప్పట్లోనే ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించిన నిర్మలమ్మ ఎక్కువగా బామ్మ పాత్రలలో నటిస్తూ ఉండేది. తెలుగు, కన్నడ ,తమిళ్ వంటి భాషలలో వెయ్యికి పైగా చిత్రాలలో నటించిన ఘనత అందుకున్నది. 2009 ఫిబ్రవరి 19న ఈమె మరణించిందట. అయితే నిర్మలమ్మ జీవితం గురించి చాలామందికి కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయట. నిర్మలమ్మ ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణారావుని సైతం ప్రేమించి మరి వివాహం చేసుకున్నదట. అయితే వీరికి సంతానం కలగలేకపోవడంతో ఒకానొక దశలో వీరు మానసికంగా కృంగిపోయారట.


చివరికి ఒక పాపను కూడా దత్తకు తీసుకొని పెంచుకొని చదువు చెప్పించి దగ్గరుండి మరి వివాహం చేయించారు. ఆమె పేరు కవిత. పెళ్లి కాగానే వీరి కూతురు విదేశాలకు వెళ్లిపోయిందట అక్కడే ఒక కుమారుడికి కూడా జన్మనిచ్చిందని అతని పేరు విజయ్ మాధల. అయితే విదేశాలలో పెరిగినప్పటికీ నిర్మలము మనవడు కూడా ఒక సినిమాలో నటించారట. అదే పడమటి సంధ్యారాగం.. ఈ చిత్రాన్ని జంధ్యాల పెరకెక్కించగా ఆంగ్లో ఇండియన్ లవ్ స్టోరీ లో విజయశాంతి హీరోయిన్గా నటించిందట.. అయితే ఇక్కడ భాష ఇబ్బందిగా రావడంతో తిరిగి మళ్ళీ ఏ సినిమాలో కూడా నటించలేదట విజయ్.. అలా కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: