
ఇప్పుడు ఇన్నాళ్ళకి దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ ఫ్యాన్స్ కోరికని నెరవేర్చబోతున్నట్లు తెలుస్తుంది. ఆ కాంబో మరేంటో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .. టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్. త్రివిక్రమ్ శ్రీనివాసరావు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ . తన మాటలతోనే మ్యాజిక్ చేస్తాడు. రామ్ పోతినేని ఎలాంటి డైలాగ్స్ అయినా సరే సునాయాసంగా చెబుతూ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు . మరి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా సెట్ అయితే మాత్రం అది జబర్దస్త్ రేంజ్ లోనే సూపర్ హిట్ అవుతుంది. కానీ ఎందుకో ఈ కాంబో ఇన్నాళ్లు సెట్ అవ్వలేదు.
గతంలో చాలాసార్లు ఈ కాంబో సెట్ అయినట్లు వార్తలు వినిపించిన ఫైనల్లీ తెరపైకి మాత్రం రాలేదు . ఈసారి మాత్రం 100% పక్కాగా వీళ్ల కాంబో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . అల్లు అర్జున్ తో కమిట్ అయిన త్రివిక్రమ్ సినిమా ఆలస్యం కాబోతుందట. అల్లు అర్జున్ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాడట. ఈ టైంలోనే త్రివిక్రమ్ - రామ్ పోతినేని తో ఒక లవబుల్ ఫ్యామిలీ రొమాంటిక్ సెంటిమెంట్ సినిమాను తెరకెక్కించాలి అంటూ ట్రై చేస్తున్నారట . అన్ని కుదిరితే ఈ కాంబో త్వరలోనే సెట్స్ పై కి రాబోతుంది అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. రామ్ పోతినేనితో మాటల మాంత్రికుడు వారెవ్వా వాట్ ఏ కాంబో నో డౌట్ మరొక జల్సా లాంటి మూవీ త్రివిక్రమ్ ఖాతాలో పడినట్లే పండగ చేసుకోండి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!