ఏంటి ప్రభాస్ వల్ల దిల్ రాజు ఇబ్బందుల్లో పడ్డారా..నిజంగానే రచయిత్రి కేసు పెట్టిందా.. అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్, తాప్సి పన్నులు హీరోయిన్లుగా నటించారు. ఇక 2011 లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అయితే ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. దాంతో నిర్మాత చిక్కుల్లో పడ్డారు. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నేను రాసిన నవల నుండి కాపీ చేశారంటూ ప్రముఖ రచయిత్రి దిల్ రాజు పై కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేస్ కోర్టులో ఉంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. నా మనసు కోరింది నిన్నే అనే నవల నుండి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ని కాపీ చేశారు అంటూ ప్రముఖ రచయిత్రి శ్యామలాదేవి దిల్ రాజు పై కేసు పెట్టింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టులో దిల్ రాజుకి తాత్కాలిక స్టే విధించారు. అయితే తాజాగా సోమవారం రోజు సుప్రీంకోర్టు దిల్ రాజుని కి వార్నింగ్ ఇచ్చింది.. ఈ ఇష్యూని తొందరగా పరిష్కరించుకోకపోతే ఇబ్బందుల్లో పడడం ఖాయం అని దిల్ రాజు తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డికి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. నా అనుమతి లేకుండా నా నవల నుండి మోసపూరితంగా ఈ సినిమాని కాపీ చేశారు అంటూ శ్యామలాదేవి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాపై సుప్రీంకోర్టులో కాపీ రైట్స్ చట్టం కింద కేసు పెట్టింది.

 అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమస్య పరిష్కరించుకోవాలని చెప్పింది.కానీ ఈ కేసు సమయం ముగియడంతో దిల్ రాజు ఈ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టుని కలవడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది.ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా టీవీలలో కూడా వస్తుంది కాబట్టి ఇది నిరంతరాయంగా సాగే నేరం కిందికి వస్తుంది అని దీన్ని తొందరగా క్లియర్ చేసుకోవాలని లేకపోతే ఇబ్బందుల్లో పడతారని దిల్ రాజు తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: