రాజమౌళి ఒక దర్శకుడు. ఒక పాన్ ఇండియా డైరెక్టర్ . సినిమాని సినిమాగా తెరకెక్కించే వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ . ఒకటా రెండా రాజమౌళి గురించి ఇలా జనాలు ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటారు . ఎన్నెన్నో ఆయన గురించి చర్చించుకుంటూ ఉంటారు . ప్రజెంట్ మహేష్ బాబుతో ఆయన ఒక సినిమాని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఇన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ సరవేగంగా ముందుకు వెళ్లింది. కాగా రీసెంట్ గానే రాజమౌళి కుటుంబంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ చనిపోవడంతో పది రోజులు పాటు సినిమాకి బ్రేక్ చెప్పి మరి ఆ కార్యక్రమాలను దగ్గరుండి చుసుకున్నాడు రాజమౌళి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .


రీసెంట్ గానే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ కంప్లీట్ చేశారట . త్వరలోనే ఆఫ్రికా అడవులకు వెళ్ళబోతుందట టీం.  ఇలాంటి మూమెంట్లోనే సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి దర్శకత్వం నటించే ఛాన్స్ వస్తే ఎవ్వరూ రిజెక్ట్ చేయరు . అది అందరికీ తెలుసు కానీ కొన్ని సందర్భాలలో అలా రిజెక్ట్ చేసే పరిస్థితులు వస్తాయి అంటూ ప్రూవ్ చేశాడు ఒక హీరో .



ఆయన మరెవరో కాదు గోపిచంద్. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ విలన్ గా హీరోగా రెండు షేడ్స్ లల్లో తన ఇన్వాల్వ్మెంట్ చూపించి కెరియర్లో మంచి స్థానానికి ఎదగ గలిగాడు.  గోపీచంద్ ఈ మధ్యకాలంలో హిట్స్ కొట్టింది లేదు.  హీరోగా ఆయన సెటిల్ అవుతాడు అన్న నమ్మకాలు ఎవరికీ లేవు . కనీసం విలన్ షేడ్స్ లో నటించి అలా ఆయన లైఫ్ సెట్ అయితే బాగుండు అని ఫాన్స్ కోరుకుంటున్నారు.  కానీ ఎంత పెద్ద సినిమాలో నైనా విలన్ షేడ్స్ లో మాత్రం చేయను అంటున్నాడు గోపీచంద్ .



రీసెంట్గా మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమాలో ఒక నెగిటివ్ పాత్ర కోసం గోపిచంద్ ని అనుకున్నారట రాహమౌళి. సినిమాలో నెగిటివ్ షేడ్స్ అస్సలు చేయను .. పైగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో నేను నెగిటివ్ షేడ్స్ చేయాలా.. నో వే అది నా కెరియర్ ని బాగా డామేజ్ చేస్తుంది అంటూ రాజమౌళి డైరెక్షన్ అయినా సరే సినిమాను రిజెక్ట్ చేశాడట.  ప్రజెంట్ ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక అందుకు గోపీచంద్ తీసుకున్న నిర్ణయానికి ఫ్యాన్స్ సంతోషపడుతున్న రాజమౌళి దర్శకత్వంలో సినిమా మిస్ అయిపోయావే అంటూ బాధ పడిపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: