
అయితే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు . రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ బిగ్ దర్శకులతో సినిమాకి కమిట్ అవుతున్నాడు . ప్రజెంట్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత సుకుమార్ తో కమిట్ అయ్యాడు . ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ దర్శకుడు తో ఒక సినిమా కి కమిట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు అనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక మూవీ కి కమిట్ అయ్యాడట . అంతేనా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అదేవిధంగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మరొకపక్క అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో సినిమా కి కమిట్ అయ్యాడు .
అంతే కాదు మరో పాన్ ఇండియా ఫిలిం గా అట్లీ దర్శకత్వంలో అలాగే బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తో ఒక మూవీకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లిస్ట్ చూస్తే మాత్రం చాలా చిన్నదిగా ఉంది . అప్పుడెప్పుడో కమిట్ అయిన వార్ 2 అంతకంటే ముందు కమిట్ అయిన దేవర దానికి తోకగా దేవర2 అలాగే ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ఇది తప్పిస్తే ఎన్టీఆర్ ఖాతాలో సినిమాలు లేవు.
అదిగో పెద్ద డైరెక్టర్ కి కమిట్ అవుతున్నాడు ఇదిగో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వినిపించడం తప్పిస్తే అఫిషియల్ అప్డేట్ లేదు . దీంతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాల స్థాయి నుంచి వెనకడుగు వేస్తున్నాడు అని .. జాగ్రత్త పడకపోతే కెరియర్ టోటల్ కొలాప్స్ అవుతుంది అంటున్నారు. నిజమే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పరంగా ఇంకా స్పీడ్ పెంచాలి . బడాబడా దర్శకులు జూనియర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు . ఏమో దానికి రీజన్ ఏమైఉంటుందో..?? అంటూ జనాలు ఆలోచిస్తున్నారు..!