టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రభాస్ "మిర్చి" మూవీ వరకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగించాడు. ఆ తర్వాత ప్రభాస్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీలలో హీరో గా నటించాడు. బాహుబలి సిరీస్ నుండి వచ్చిన రెండు మూవీ లు కూడా ఒక దానిని మించి ఒకటి అద్భుతమైన విజయాలను సాధించడంతో ప్రభాస్ కి ఇండియా వ్యాప్తంగా ఈ మూవీ ద్వారా గుర్తింపు వచ్చింది.

ప్రభాస్ "బాహుబలి" మూవీ తర్వాత కేవలం పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. కానీ ప్రభాస్ కి బాహుబలి మూవీ తర్వాత నటించిన కొన్ని సినిమాల ద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశే మిగిలింది. అలా వరుసగా బాహుబలి సిరీస్ మూవీ ల తర్వాత అపజయాలను ఎదుర్కొంటూ వచ్చిన ప్రభాస్ కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... రవి బుశ్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని మార్చి 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల కూడా చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: