అసలు మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా.. మన ఇండియాలోనే కాదు చిరంజీవికి ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదే చెప్పుకోవచ్చు. అలాంటిది చిరంజీవి అంటే మన ఇండియాలోనే తెలియదు అని ఆయనని ఘోరంగా అవమానించారు.అంతే కాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి అంటే ఎవరో నాకు తెలియదు అనే కామెంట్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. మరి ఇంతకీ అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవిని తెలియదని అన్న ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాక బయట ఎక్కడికి వెళ్ళినా వారికి హీరో అనే గుర్తింపు ఉండి సెల్ఫీలు తీసుకోవడం ఆటోగ్రాఫర్లు తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇక మధ్యమధ్యలో కొంతమంది సెలబ్రిటీలు మాకు ఆయన అంటే ఎవరో తెలియదు మాకు ఈ హీరో తెలియదు అని కొన్నిసార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు.

అలా జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో నాకు చిరంజీవి అంటే ఎవరో తెలియదు అని మాట్లాడి ట్రోలింగ్ కి గురయ్యారు. అలా చిరంజీవి విషయంలోనే కాదు చాలామంది నటీనటుల విషయంలో కొంతమంది సెలబ్రిటీలు కూడా వాళ్ళు ఎవరో తెలియదని చెప్పి విమర్శల పాలయ్యారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరో నాకు తెలియదని ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం చాలామంది సెలబ్రిటీలు దుబాయ్ కి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.అలా దుబాయ్ కి వెళ్ళిన సెలబ్రిటీలలో చిరంజీవి, సుకుమార్లు ఉన్నారు. అలాగే ఏపీ టీడీపీ ఎంపీ అయినటువంటి నారా లోకేష్ కూడా దుబాయిలో జరిగే మ్యాచ్ చూడడానికి వెళ్లారు.అలా పలువురు సెలబ్రిటీలు దుబాయ్ లో దర్శనమిచ్చారు.

 అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఒక స్పోర్ట్స్ అనలిస్టు తన సోషల్ మీడియా ఖాతాలో దుబాయ్ లో జరిగే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడడం కోసం చిరంజీవి వచ్చారు అని పోస్ట్ పెట్టారు.అయితే ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజన్ ఇంతకీ చిరంజీవి ఎవరు అని తెలియనట్లుగా కామెంట్ పెట్టాడు. దానికి మరొక నెటిజన్ చిరంజీవి ఎవరో తెలియదా.. ఆయన రాంచరణ్ తండ్రి అని రిప్లై ఇవ్వగా..అసలు రాంచరణ్ ఎవరు అని మళ్లీ కామెంట్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఆ వ్యక్తి పెట్టిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. అంతేకాదు అంత పెద్ద హీరో ఎవరో తెలియదా..ఇది నిజంగా మెగాస్టార్ కి అవమానమే.. గ్లోబల్ స్టార్ గా పేరుగాంచిన రామ్ చరణ్ కూడా తెలియదంటే అసలు ఆ వ్యక్తి ఇండియా వాడేనా అని మరికొంతమంది మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి రామ్ చరణ్ లు ఎవరో తెలియదంటూ ఆ నెటిజన్ పెట్టిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: