ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ కు అధికారంలోకి వచ్చిన కొంతకాలంలోనే సొంత పార్టీ నుంచి ఊహించని విధంగా షాకులు తగులుతున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజనామా ఏపీ రాజకీయాల్లో ఒకింత సంచలనంగా మారింది. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన రాజీనామా గురించి ఒకింత ఎక్కువగానే చర్చ జరుగుతుండటం గమనార్హం.
 
ఏపీ ఫైబర్ నెట్ ఎండీ, ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ తీరు నచ్చకపోవడం వల్లే జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారని సోషల్ మీడియా వేదికగా జోరుగా కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర జరిగిన పంచాయితీలో తనకు న్యాయం జరగలేదని భావించి జీవీ రెడ్డి ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం.
 
అవినీతి అధికారులతో సర్దుకుపోవడం సరి కాదని భావించిన జీవీ రెడ్డి చివరకు తన పదవికి రాజీనామా చేయడానికే ఆసక్తి చూపించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. నీతిగా నిజాయితీగా పని చేయడమే జీవీ రెడ్డికి మైనస్ అయిందని ఇతర అధికారులలా వ్యవహరించకపోవడమే ఆయన పాలిట శాపమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
తన పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన మనస్సు ఏ స్థాయిలో హర్ట్ అయిందో సులువుగానే అర్థమవుతుంది. జీవీ రెడ్డి గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఆయనను నిందించడం మాత్రం సరి కాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. జీవీ రెడ్డి భవిష్యత్తులో తనకు జరిగిన అన్యాయం గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. జీవీ రెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు కారణమవుతుందో చూడాల్సి ఉంది.




 


మరింత సమాచారం తెలుసుకోండి: