తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ప్రదీప్ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా కూడా తనకంటూ ఒక మంచి ఈమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

కొంత కాలం క్రితం ప్రదీప్ రంగనాథన్ "లవ్ టుడే" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దానితో ఈ మూవీ ద్వారా ప్రదీప్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. తాజాగా ఈయన డ్రాగన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఈ మూవీ బృందం అధికారికంగా ఓ పోస్టర్ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 50.22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: