డైరెక్టర్ త్రినాధరావు దర్శకత్వం వహించి రిలీజ్ కు సిద్ధంగా ఉన్న తాజా మూవీ మజాకా..మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న మజాకా సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ మేకర్స్. సందీప్ కిషన్ హీరోగా హీరో తండ్రి పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. అలా ఈ సినిమాతో మన్మధుడు మూవీ హీరోయిన్ అన్షు అంబానీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో తండ్రి కొడుకులు ఒకేసారి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది చూపించారు.అయితే మొదట ఈ సినిమాని మల్టీ స్టారర్ గా తీద్దాం అనుకున్నారట. అలాగే డైరెక్టర్ గా కళ్యాణ్ కృష్ణని అనుకున్నారట.. అయితే ఈ విషయం గురించి స్వయంగా డైరెక్టర్ త్రినాధరావు మజాకా ప్రమోషన్స్ లో చెప్పారు.ఆయన మాట్లాడుతూ..మొదట ఈ సినిమాని చిరంజీవి, సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్లో మల్టీ స్టారర్ గా తీద్దామనుకున్నారు. 

లాగే ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ ని డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ ఎందుకో ఈ సినిమా మిస్ అయింది. అలాగే రావు రమేష్ లాంటి పాత్ర చిరంజీవి ఇమేజ్ కి అస్సలు సెట్ అవ్వదు.అందుకే ఈ సినిమా రిజెక్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ కథ చిరంజీవి దగ్గరికి వెళ్ళింది.కానీ ఆయనకు ఏ వెర్షన్ లో కథ చెప్పారో నాకు తెలియదు. అలాగే రావు రమేష్ లాంటి క్యారెక్టర్ ని పెట్టి మేము తీసిన ఈ స్టోరీ చిరంజీవి ఇమేజ్ కి అస్సలు సెట్ అవ్వదు. ఇక ఈ సినిమా చిరంజీవి చేయకపోవడానికి కారణం కూడా ఈ కథ ఆయన ఇమేజ్ కి సెట్ అవ్వదనే కావచ్చు.

రావు రమేష్ పోషించిన పాత్రలో తాను నటిస్తే తన ఇమేజ్ కి సెట్ అవ్వదనే ఈ సినిమాని చిరంజీవి గారు రిజెక్ట్ చేశారు కావచ్చు అంటూ సందీప్ కిషన్ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ విషయం ప్రస్తుతం మీడియాలో వైరల్ అవ్వడంతో చిరంజీవి, సిద్దు జొన్నగడ్డ కాంబోలో అప్పట్లో ఓ సినిమా వస్తుందని వార్తలు వినిపించాయి. అది ఇదే కావచ్చు.కానీ వీరి కాంబోలో సినిమా వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే వీరిద్దరి కామెడీ టైమింగ్ వేరే లెవల్ లో ఉండేది.సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది కానీ జస్ట్ మిస్ అయింది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: