
అయితే ఇక్కడికి రానా సరుకులతో పాటుగా కూరగాయలు ,మాంసము, పండ్లు, దుస్తులు ఇతరత్రా వాటికి అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయట. బయట ఎక్కడ దొరకని అంతర్జాతీయ సరుకు కూడా ఇక్కడ లభిస్తుందని సమాచారం. అలాగే ఇక్కడ జ్యూస్ కాఫీ చాక్లెట్స్ నూడిల్స్ ఇతరత్రాభి కూడా ఉంటాయట. అలాగే ప్రముఖులు సైతం ఉపయోగించే వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ లభిస్తాయట. దాదాపు ఇక్కడ 6 కిలోల మష్రూమ్ ఫుడ్ సుమారుగా 5,00000 ఉంటుందట.
సాధారణంగా 100 గ్రాముల పుట్టగొడుగులు 150 -1000 వరకు ఉంటుంది. కానీ రానా షాపులో పుట్టగొడుగుల ధర ఏకంగా లక్షలలో ఉందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కూరగాయలు కూడా ఇతర దేశాల నుంచి తీసుకువస్తారట ముఖ్యంగా నెదర్లాండ్ మెక్సికో స్పెయిన్ వంటి దేశాలలో పండించే వాటిని ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నారట. 200 గ్రాములు టమోటా 850 రూపాయలుగా నిర్ణయించారు.. అలాగే ఒక గ్లాస్ చెరుకు రసం 275 ఉంటుందని.. ఒక కొబ్బరి బొండం 1000 రూపాయలని.. ఈ ధరలన్నీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రానా, మిహికా పెట్టినటువంటి ఈ షాప్ కేవలం ధనవంతుల కేనా అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంతమంది మాత్రం రైతుల దగ్గర పండించేటువంటి కూరగాయలను ఫ్రెష్ గా కొని వాటిని అమ్మి రైతులకు ఏదైనా ఆదాయం మార్గాన్ని కల్పించవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రానా షాపులో ధరలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.