టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీలా ఒకరు. ఈ ముద్దు గుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇందులో ఈమె తన నటనతో , అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత వరుస పెట్టి ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

ఈమెకు విజయాలు ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో రాకపోయినా క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్ అయినటువంటి పూజ హెగ్డే కు వచ్చిన రెండు సినిమా అవకాశాలను కూడా శ్రీ లీలా లాగేసుకుంది. అది ఎలా అనుకుంటున్నారా ..? కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మొదటగా హీరోయిన్గా పూజ హెగ్డేను అనుకున్నారు.

ఆమెపై కొంత కాలం పాటు షూటింగ్ కూడా చేశారు. కానీ చివరగా ఈ మూవీ లో శ్రీ లీలా ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా పూజా హెగ్డే హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమెను తీసేసి శ్రీ లీలా ను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఇలా పూజ హెగ్డే ను అనుకున్నా ఈ రెండు సినిమాల్లో ఆఖరుగా ఆమెను తీసేసి శ్రీ లీలా ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: